Friday, July 20, 2012

జో అచ్యుతానంద.....


వింత వింత మా వినతులు విని అలసివుంటావూ!
ఆదరాన వరములిచ్చీ యిచ్చీ సేద తీర తీరికాయెనొ లేదో!
బ్రహ్మాండమంత లోన దాచి మాకందక తిరిగేవూ!
అరుదెంచవా మన్నించి ఒదగవా ఊయలలో...
ప్రేమ మీర పాడేము జోల మాతండ్రి నీకీరీతి..
"జో అచ్యుతానంద!జోజో ముకుందా! లాలి పరమానంద!రామగోవిందా!"

శ్రీ అన్నమార్య గురుదేవ!హరి నుతియించితి నీ కృతి చేయూతనందించ!

No comments:

Post a Comment