Monday, October 1, 2012
















అన్నమయ్య సదనమిది అతని అంతరంగమిది
శ్రీదేవుడు౦డేటి ఆనంద నిలయమిది..

శృతిలయలు రాజిల్లగా భావసిరులు శోభిల్లగా..
సకల శాస్త్ర సారమ్మును సర్వ మంత్ర సూక్ష్మమ్మును
తన కీర్తనలలో పొదిగి వెంకటేశుడుప్పొంగగా
ఆలపించ  వెలసినాడు అన్నమయ్య ఇచ్చటను..

అక్షరాలన్నియు కలిసి అమితానందముతో
సుస్వరాల నడక నేర్చి రాగ రహస్యము తెలిసి
తత్వాల లోతులెరిగి  విశ్వ వేదికలపైన
అమరగానమై భాసిల్ల ..శిక్షణ నొందు గురుకులమిది..అమ్మ హృద్ గ్రంథమిది

శ్రీనందకమే హరి సంకీర్తనమై..
అరిషడ్వర్గమునంతా అంతముగావించగా
మనసు దీపమై వెలిగే...మమతల కోవెలయిది హరి దేవాలయమిది..
(After some corrections made by Dr.Shobharaju garu)

ఎంతదూరాన ఉందో నీ చిద్విలాస మందిరం..
కనుచూపుమేరనైనా కనిపించదే..?
ఏనాటికైనా నా మహరాజుని చూస్తానని..
తెలిసీతెలియని పదాలతో నీమీద పాటలల్లుకుంటూ
ఆనందమనే రహదారిలో..బాధలనే ముళ్ళను దాటుకుంటూ..
మాయ పొరలు కమ్మి దారులే కనరాకున్నా...
వెరవక వస్తున్నా..మదినిండా ప్రేమని వెంట తెస్తున్నా..
నీకోటముంగిట కొచ్చి నిలిస్తే ..ఓసైగ చేసి లోనికి రానిస్తావు కదూ!!!
నిను పాడ మనసాయెనయ్యా...
సువర్ణ కుసుమాల౦టి కీర్తనల ...లలిత కోమల శ్రావ్య గళాల....
నిను నుతియించిన ధన్యులెందరో.....
ఆ సుమధుర గీతాంజలిని విని..
శృతిలయలులేని..రాగమసలు తెలియని...
భావము పలుకలేని..ఆర్తి ఒక్కటే ఆధారమైన...

నా పాట..నీకు రుచించునో లేదో...అయినా
కరుణించి ..కానిమ్మని ..నీ పద ..కీర్తనా సుమపారిజాతాలరాశిలో...
ఓ చివరనుంచవయ్యా....కొంత సుగంధమ్మలదుకొని తరించునేమో...?

Saturday, September 22, 2012

ఇంతదూరం నడిచే శక్తినిచ్చింది తనే అయినా...
ఎదుటికొచ్చి నిలొచొని...ఇంతటి అందాలమూర్తిరూపుని..
కాసింత కళ్ళలో నింపుకున్నా...ఆపై కళ్ళనిండా నీళ్ళు..
మాట పెగలలేదు...అడుగు ముందుపడలేదు....
వెక్కి పడుతున్న హృదయం....
ఎన్ని యుగాలుగా జన్మ వేచిందో ఈ క్షణం కోసం..
ఏ పుణ్యం ఈ దర్శనమిచ్చిందో....
మదినిండా మాధవుడే ఊరడిస్తూ...
అశాంతిగా ఉన్నవేళ...
ఆలోచనలనే ఆగమేఘాల మీద సవారికొచ్చాడు...
ఎవరీ మహారాజని పోల్చుకునేలోపే...
చల్లని చిరునవ్వునిచ్చి వెన్నుతట్టి వెళ్ళాడు...
మది పథాన వెతికి చూస్తే ఆదిపురుషుని పాదముద్రలు....
పాడుతు వెళుతున్నా పా౦థుడినై "ఈ పాదమే కదా ఇల ఎల్ల గొలిచినది...ఈ పాదమే కదా..."

Tuesday, July 31, 2012

అపరాధిని.....


అక్షరాలకి అడుగులు నేర్పి...పదాలకి పరుగునిచ్చి...
సులలిత భావనలెల్ల...విరచించే చైతన్యమిచ్చి....
నీ పదముల చేర్చగా భావసుమమాలలని..
ఇంత జాగుచేసినానయా....చైతన్యమూర్తీ....
వ్యర్థమాయే...ఇంత కాలమెల్ల....
తెలియనైతి సత్యమున్ను..ఎరుగనైతి కరుణ నీది..
నిను చేర విలువ లేదందువో.. ఏమో...
ముకుళించి వేడెద....గొనుమయ్య నన్ను..
"అపరాధిని నేనైనాను......"


"శ్రీ అన్నమార్య గురుదేవ!హరి వేడితి నీకృతి చేయూత నందించ!

Thursday, July 26, 2012

హరి అవతారమీతడు ......



అంతరంగమెల్ల హరికి నర్పించి తరియించె నీతడు...
బ్రహ్మోపదేశమిచ్చె నిందరికి సంకీర్తనాంబుధియై..
ఏ తపము చేశామో..ఏ సేవలొనరించామో...
గురువైనాడీతడు..తోవ చూపె మమ్ములనలరించి....
"హరి అవతారమీతడు అన్నమయ్య ..అరయమా గురుడితడు అన్నమయ్య......"