Tuesday, July 17, 2012

ఇంతా విష్ణుమయమే......


ఏ పదమునందు వెతకినా బీజాక్షరమై గోచరించే నీ దివ్యనామం!
మదిలోయల మధురోహలందు నిండె నీ ప్రియ మోహనరూపం!
ఏ గానము విన్నావీనులవిందై నీ సంకీర్తనే!
అంతరంగాన ఆనందభైరవి అలాపనలే!
ఏ పుణ్యం ఈ జన్మమిచ్చిందో.... మది పాడే
"ఎదుట ఎవ్వరులేరు ..ఇంతా విష్ణుమయమే"...

శ్రీ అన్నమార్య గురుదేవ!హరి నుతియించితి నీ కృతి చేయూతనందించ!

No comments:

Post a Comment